ఐపీఎల్ 2023 లక్నో, బెంగళూరు మ్యాచ్ లో నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీ మధ్య స్లెడ్జింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ ముగిశాక షేక్ హ్యాండ్ ఇచ్చుకునే టైంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగింది. ఈ వివాదం రచ్చ లేపింది. కోహ్లీ ఫ్యాన్స్ గంభీర్, నవీన్ పై తీవ్రంగా మండి పడ్డారు. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు. ఇన్నాళ్లకు గంభీర్ ఈ వివాధంపై నోరు మెదిపాడు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గంభీర్.. ‘నవీన్ చేసింది కరెక్ట్ పని. అతని ప్లేస్ లో వేరే ఆటగాడున్నా వాళ్లకు అండగా నేను నిలబడతా. జట్టు సహ కోచ్ గా అది నా బాధ్యత. కోహ్లీపై నాకు ఎలాంటి విభేదాలు లేవు. ఆ ప్లేస్ లో ధోనీ ఉన్నా నేను అదే చేస్తా. అయితే, ఆ గొడవలన్నీ వ్యక్తిగతం కాదు. కోహ్లీపై నాకు ఎలాంటి కోపం లేదు. నేనెప్పుడూ మ్యాచ్ గెలవాలని కోరుకుంటా. అయితే, ఫీల్డ్ లో జరిగింది అక్కడి వరకే పరిమితం అవుతుంది. కానీ, టీఆర్పీ రేటింగ్ ల కోసం మీడియానే దాన్ని పెద్దది చేస్తుంది. నేనెప్పుడూ న్యాయం వైపు నిలబడతా. ఐపీఎల్ టైంలో గ్రౌండ్ లో ఏం జరిగిందని వివరన ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నేను చేసిందాన్పి సమర్ధించుకుంటున్నా. పరాదేశం వారికి సపోర్ట్ ఇవ్వకూడదని ఏం లేదు. అక్కడ ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ల సైడ్ ఉండాలి’ అంటూ గంభీర్ జవాబిచ్చాడు. ఈ గొడవపై సీరియస్ అయిన బీసీసీఐ గంభీర్, కోహ్లీ, నవీన్ లకు జరిమానా విధించింది.