ఏపీ డిప్యూటీ సీఎంపై కేసు నమోదు
Vijay Kumar | 13 Jan 2024 8:54 PM IST
X
X
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ఇటీవల కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీపై నారాయణస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారని బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు చేశారు. సోనియాగాంధీని కించరపరిచేలా మాట్లాడారని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ క్రమంలోనే పోలీసులు నారాయణస్వామి వ్యాఖ్యలపై దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడిన వీడియో ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఆ వీడియోలో నారాయణస్వామి బాధ్యతారహితంగా మాట్లాడారని పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఆయనపై ఐపీసీ 504, 505(2), r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు వివరాలను బేగంబజార్ సీఐ శంకర్ వెల్లడించారు.
Updated : 13 Jan 2024 8:54 PM IST
Tags: case Hyderabad AP Deputy CM Narayana Swamy aicc sonia gandhi mallu ravi begumbazaar ps fir ipc
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire