Home > ఆంధ్రప్రదేశ్ > ప్రతి పేద కుటుంబానికి నెలకి రూ.5 వేల ఆర్థిక సాయం.. Mallikarjuna Kharge

ప్రతి పేద కుటుంబానికి నెలకి రూ.5 వేల ఆర్థిక సాయం.. Mallikarjuna Kharge

ప్రతి పేద కుటుంబానికి నెలకి రూ.5 వేల ఆర్థిక సాయం.. Mallikarjuna Kharge
X

ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి పేద కుటుంబానికి నెలకి రూ.5 వేల ఆర్థిక సాయం అందిస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. సోమవారం ఏపీలోని అనంతపురంలో జరిగిన కాంగ్రెస్ న్యాయ సాధన సభకు ఏపీసీసీ చీఫ్ షర్మిలతో కలిసి ఖర్గే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే ఇందిరమ్మ యూనివర్సల్ బేసిక్ ఇన్కం సపోర్టు కింద ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేలు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్లోనే వేస్తామని అన్నారు. తమ గ్యారెంటీ మోడీ గ్యారెంటీలాంటిది కాదని సెటైర్లు వేశారు. మోడీ గ్యారెంటీ అంటూ ఏ సభలో చూసిన ప్రధాని తన గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. మోడీ గ్యారెంటీ నిజమైతే ఎంత మంది అకౌంట్లలో రూ.15 లక్షలు పడ్డాయని ప్రశ్నించారు. మోడీ చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాల పరిస్థితి ఏంటని అన్నారు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేశారా అని ప్రశ్నించారు. పేదల సొమ్మును మోడీ ధనికులకు దోచిపెడుతున్నారని అన్నారు

అక్కడ మోడీ.. ఇక్కడ జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ మోడీకి బానిసలుగా మారారని ఆరోపించారు. నాడు రాష్ట్ర విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా కల్పించిందని, కానీ దాన్ని ఈ పదేళ్ల కాలంలో మోడీ అమలు చేయలేదని అన్నారు. అలాంటి వ్యక్తికి సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ తొత్తులుగా మారారని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని అన్నారు. కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే చేసి తీరుతుందని అన్నారు. రానున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఖర్గే కోరారు.

Updated : 26 Feb 2024 8:30 PM IST
Tags:    
Next Story
Share it
Top