Home > ఆంధ్రప్రదేశ్ > కొంగు పట్టి అంగన్వాడీల భిక్షాటన

కొంగు పట్టి అంగన్వాడీల భిక్షాటన

కొంగు పట్టి అంగన్వాడీల భిక్షాటన
X

ఏపీలో అంగన్వాడీ వర్కర్ల సమ్మె ఉద్ధృతంగా సాగుతోంది. కనీస వేతనాలు, గ్రాట్యుటీ సహా తమ సమస్యల పరిష్కారం కోరుతూ గత 25 రోజులుగా అంగన్వాడీలు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా తమ డిమాండ్లు పరిష్కారం చెయ్యాలని జగన్ ప్రభుత్వాన్ని కోరుతూ విశాఖలో అంగన్వాడీలు కొంగు పట్టి భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఎన్నికల సమయంలో తమకు వేతనాలు పెంచుతామన్న సీఎం ఆ తర్వాత పట్టించుకోవడం లేదని అన్నారు.

రాష్ట్రంలో 1.06 లక్షల మంది సమ్మెలో ఉంటే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తారా? అంటూ నిలదీశారు. సీఎం తన పుట్టినరోజు సందర్భంగా వేతనాలు పెంచుతారని ఆశించామని కానీ అలా జరగలేదని వాపోయారు. కనీసం క్రిస్మస్ కో లేక కొత్త సంవత్సరానికో పెంచుతారనుకుంటే అదీ జరగలేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె ఆగదని స్పష్టం చేశారు. సంక్రాంతిలోగా వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు.

Updated : 5 Jan 2024 9:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top