Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీకి రాజధాని లేక నాలుగేళ్లు.. మాజీ సీఎం చంద్రబాబు

ఏపీకి రాజధాని లేక నాలుగేళ్లు.. మాజీ సీఎం చంద్రబాబు

ఏపీకి రాజధాని లేక నాలుగేళ్లు.. మాజీ సీఎం చంద్రబాబు
X

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నేటితో ఏపీకి రాజధాని లేక నాలుగేళ్లు అవుతోందని అన్నారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున సీఎం జగన్ ఏపీ రాజధానిగా అమరావతిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. దీంతో నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని అన్నారు. సీఎం జగన్ తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయంతో అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు రోడ్డు మీద పడ్డారని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను టీడీపీ గుర్తుపెట్టుకుంటుందని, వాళ్ల సేవలను మర్చిపోమని చంద్రబాబు అన్నారు. తాము అధికారంలోకి రాగానే 3 నెలల్లో సీఎం జగన్ హయాంలో జరిగిన తప్పులన్నింటినీ సరిదిద్దుతామని అన్నారు. అమరావతి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాగా ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా తెలిపారు.

Updated : 17 Dec 2023 10:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top