Home > ఆంధ్రప్రదేశ్ > జగన్ నుంచి ఏపీని కాపాడటం కోసమే చేతులు కలిపాం.. Chandrababu Naidu

జగన్ నుంచి ఏపీని కాపాడటం కోసమే చేతులు కలిపాం.. Chandrababu Naidu

జగన్ నుంచి ఏపీని కాపాడటం కోసమే చేతులు కలిపాం.. Chandrababu Naidu
X

టీడీపీ-జనసేన చేతులు కలిపింది అధికారం కోసం కాదని.. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో జెండా బహిరంగ సభను నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరు పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. విధ్వంసం అయిన రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం, హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని తిరిగి బ్రతికించుకోవడం కోసం తాము చేతులు కలిపామని అన్నారు. దెబ్బ తిన్న రైతాంగం కోసం, యువకులకు ఉద్యోగాల కోసం తమ రెండు పార్టీలు కలిశాయని అన్నారు. టీడీపీ-జనసేన పొత్తు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి అహంకారం వల్ల రాష్ట్రం ఆగమైతుంటే తాము చూడలేకే తామిద్దరం కలిసి ఎన్నికల బరిలోకి వచ్చామని అన్నారు. జనసందోహాన్ని చూశాక కొండనైనా పిండి చేస్తామనే నమ్మకం కలిగిందని అన్నారు. ఏపీ చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని అన్నారు. ఈ సభ ఏపీ భవిష్యత్తను మార్చేస్తుందని అన్నారు. త్వరలోనే రాష్ట్రానికి నవోదయం రాబోతుందని అన్నారు.

హేతుబద్ధత లేకుండా 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు పవన్ కల్యాణ్ తమ పార్టీకి సపోర్టు చేశారని అన్నారు. నాడు ఎన్నో ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ అభివృద్ధిలో ముందుకు వెళ్లామని అన్నారు. ఏపీలో అన్ని వనరులు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ ను మించేలా అమరావతిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించామని అన్నారు. కేంద్రం నుంచి 11 విద్యాసంస్థలను తీసుకొచ్చామని అన్నారు. పోలవరం పూర్తి చేయడానికి ప్రయత్నించామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి, 10 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చామని అన్నారు.కానీ సైకో జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని అన్నారు. ఏ సీఎం అయినా అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తారని, కానీ జగన్ తన ఇంటి పక్కన ఉన్న ప్రజా వేదికను కూల్చి పాలన మొదలుపెట్టారని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆయన పాలన విధ్వంసంతో మొదలు పెట్టారని అన్నారు. జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ప్రతిపక్షాలను వేధించారని అన్నారు. సినిమా ఇండస్ట్రీ పెద్దలను జగన్ మోహన్ రెడ్డి అవమానించారని అన్నారు. వై నాట్ 175 అని జగన్ అంటున్నారని.. కానీ వై నాట్ పులివెందుల.. హూ కిల్డ్ బాబాయి అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ సినిమా అట్టర్ ఫ్లాప్ అని, ఆ సినిమాకు సీక్వెల్ ఉండదని అన్నారు. వైసీపీ జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Updated : 28 Feb 2024 1:57 PM GMT
Tags:    
Next Story
Share it
Top