మరణం లేని మహానేత అంబేద్కర్.. సీఎం జగన్
X
మరణం లేని మహానేత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక విధానాల నిర్ణేత అంబేద్కర్ అని, ఆయన మరణంలేని మహా శక్తి అని అన్నారు. అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరముందని అన్నారు. తన జీవితాన్ని పేదల కోసం త్యాగం చేసి, వారి అభ్యున్నతికి అనుక్షణం పరితపించిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ప్రతిరోజు స్మరించుకోవాలని సూచించారు. అందరూ ఆయన విధానాలను పాటించాలన్నారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగాన్ని రచించిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని సమాజంలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతను గుర్తెరిగి సమ సమాజ నిర్మాణంలో మన వంతు పాత్రను పోషించడమే అంబేద్కర్‌కు మనం అర్పించే నివాళి అని అభిప్రాయపడ్డారు.
చదువు ద్వారానే మనిషి జ్ఙానం సంపాదించగలడని చదివే అన్నిటికి మూలం అని చదువు వల్లే అంబేద్కర్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ప్రతి ఒక్కరికి ఫ్రభుత్వ ఫలాలు అందాలని అంబేద్కర్ రాజ్యాంగాని సృష్టించారని అన్నారు. కొంత మంది వ్యక్తులు మాటలు మాత్రమే మాట్లాడుతారని కొందరు ఆచరణలో పనులు చేస్తారని అందులో అంబేద్కర్ ప్రథముడు అని అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి అని మండిపడ్డారు.