Home > ఆంధ్రప్రదేశ్ > YCP Sabha : వైసీపీ 'సిద్ధం' సభ వద్ద విపక్ష నేతల కటౌట్లు

YCP Sabha : వైసీపీ 'సిద్ధం' సభ వద్ద విపక్ష నేతల కటౌట్లు

YCP Sabha : వైసీపీ సిద్ధం సభ వద్ద విపక్ష నేతల కటౌట్లు
X

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో వైసీపీ 'సిద్ధం'పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ క్రమంలోనే సభా వేదికతో పాటు సభా ప్రాంగణం మొత్తం వైసీపీ జెండాలు, జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల ఫ్లెక్సీలు, భారీ కటౌట్లతో నిండిపోయింది. అయితే వైసీపీ నిర్వహించిన ఈ సభా ప్రాంగణంలో విపక్ష పార్టీల అధినేతల కటౌట్లు కూడా ఏర్పాటు చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కటౌట్లను పెట్టారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నేత, బీజేపీ నేతల కటౌట్లు కూడా పెట్టారు. అయితే ఆ నాలుగు పార్టీలకు సంబంధించిన కార్టూన్ ఫోటోలను పెట్టారు.

ఇక ఈ సభలో మాట్లాడిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. భీమిలిలో ఇవాళ తనకు అటు సముద్రం, ఇటు జన సముద్రం కనిపిస్తోందని అన్నారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ ఒక్కో సేనాధిపతి కనిపిస్తున్నారని అన్నారు. ఇటు పక్క పాండవ సైన్యం ఉంటే, అటు పక్క కౌరవసైన్యం ఉందని.. ఈ యుద్ధంలో చంద్రబాబు సహా ప్రతి ఒక్కరూ ఓడిపోకతప్పదు అని అన్నారు. పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి తాను అభిమన్యుడ్ని కానని, తాను అర్జునుడ్ని అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ అర్జునుడికి తోడు శ్రీకృష్ణుడి వంటి ప్రజలు తోడున్నారని చెప్పుకొచ్చారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి 175కి 175 సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.




Updated : 27 Jan 2024 1:52 PM GMT
Tags:    
Next Story
Share it
Top