ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి.. ఎంపీ కేశినేని నాని డిమాండ్
X
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, మాజీ సీఎం ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని వైసీపీ ఎంపీ కేశినాని నాని డిమాండ్ చేశారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, వ్యయసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు కూడా భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేశినేని నాని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలుగు ప్రజల ముద్దుబిడ్డ పీవీకి భారతరత్న రావడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఆయనకు అవార్డు రావడం తమకు సంతోషకరమని, కానీ ఎన్టీఆర్ కూ భారతరత్న ఇవ్వాలని అన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు, రూ.2కే కిలో రేషన్ బియ్యం వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల పాలిట పెన్నిధిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.
అలాగే ఎన్నో విజయవంతమైన సినిమాలతో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న మహానటుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ సేవలను గుర్తించి ఆయనకు భారతరత్న ప్రకటించాలని, ఈ పురస్కారంతో ఆయనను సత్కరించుకోవడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఎన్టీఆర్ కు కూడా భారతరత్న ఇవ్వాలని పార్టీలకతీతంగా కృషి చేయాలని కేశినాని నాని అన్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.