Home > ఆంధ్రప్రదేశ్ > తుప్పు పట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాస్ కు గోల్డ్ కోటింగ్ వేశారు: మంత్రి అమర్నాథ్

తుప్పు పట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాస్ కు గోల్డ్ కోటింగ్ వేశారు: మంత్రి అమర్నాథ్

తుప్పు పట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాస్ కు గోల్డ్ కోటింగ్ వేశారు: మంత్రి అమర్నాథ్
X

ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుప్పు పట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాస్ కు గోల్డ్ కోటింగ్ వేసి ప్రజలకు ముందుకు వచ్చారని సెటైర్లు వేశారు. అభ్యర్థల ప్రకటన తర్వాత కాపులను కమ్మవాళ్లు.. కమ్మవాళ్లను కాపు వాళ్లు నమ్మడంలేదని అర్థమైందని అన్నారు. మొత్తం 175 సీట్లలో కనీసం 25 శాతం సీట్లు కూడా జనసేనకు రాకపోవడం పవన్ కల్యాణ్ కు సిగ్గుచేటని అన్నారు. చంద్రబాబును గెలిపించడానికే పవన్ మరోసారి ప్రయత్నం చేస్తున్నట్లు సీట్ల పంపకాన్ని చూస్తూ అర్థమవుతోందని అన్నారు. టీడీపీ-జనసేన సీట్ల పంపకంతో వైసీపీ విజయం మరింత సునాయసం కానుందని అన్నారు. 175 స్థానాలకు ఆ రెండు పార్టీలకు కలిసి అభ్యర్థులు కరువయ్యారని వారి జాబితా చూస్తూ అర్థమయిందని అన్నారు. ఎన్ని కూటములు వచ్చినా.. ఎవరూ ఎన్ని కుట్రలు పన్నినా ఏపీలో మళ్లీ గెలిచేది వైసీపీనేనని అన్నారు. కాగా ఇవాళ టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితాను ప్రకటించారు. టీడీపీకి సంబంధించి 94 సీట్లకు అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. జనసేన 24 సీట్లలో 5 మంది జాబితాను ప్రకటించారు.

ఇక జనసేనకు 3 ఎంపీ సీట్లు కేటాయించారు. ఇక అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో టికెట్ రానివాళ్లు నిరసన వ్యక్తం చేశారు. ఇంత కాలం పార్టీని నమ్ముకుంటే వేరే పార్టీ వాళ్లకు టికెట్ ఎలా ఇస్తారని.. సొంత పార్టీలోనే తనను కాకుండా ఇంకొకరికి సీటు ఎలా కేటాయిస్తారంటూ సీటు రానివాళ్లు భగ్గుమన్నారు. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాల్లో టీడీపీ ఫ్లెక్సీలను చించివేశారు ఆ పార్టీ శ్రేణులు. పెనుగొండలో సబితమ్మకు టికెట్ కేటాయించడంతో టీడీపీ శ్రేణుు భగ్గుమన్నాయి. ఇక మాజీ ఎమ్మెల్యే పార్థసారథి వర్గీయులు టీడీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఎక టీడీపీ-జనసేన మొదటి జాబితాలో మొత్తం 13 మంది మహిళలకు టీడీపీ టికెట్లు ఇచ్చింది.

Updated : 24 Feb 2024 10:18 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top