తమ్ముడు పవన్ ఇప్పటికైనా అర్థం అయిందా?.. మంత్రి అంబటి ట్వీట్
X
అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్షంగా తమ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించడంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు చర్యల్ని పవన్ తప్పుపట్టారు. బాబుకు ఎలాగైతే ఒత్తిడి ఉందో తనకు అలాగే ఒత్తిడి ఉందంటూ తమ పార్టీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తు అంశంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర కామెంట్ చేశారు. పొత్తు ధర్మమే కాదు ఏ ధర్మము పాటించని వాడే "బాబు" అంటూ సంచలన కామెంట్స్ చేశారు. బాబు నిజస్వరూపం గురించి ఇప్పటికైనా తెలుసుకో తమ్ముడు పవన్ కల్యాణ్ అంటూ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా మంత్రి అంబటి ఈ వ్యాఖ్యలపై అటు జనసేన, ఇటు టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తే తమకు ఓటమి తప్పదనే భయంతోనే వైసీపీ నేతలు ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు రాలేదని, వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని, వైసీపీని ఏపీ నుంచి సాగనంపుతాయని అంటున్నారు.