Home > ఆంధ్రప్రదేశ్ > Sridhar Babu : మేడారం పండుగకు జాతీయ హోదా కల్పించాలి.. మంత్రి శ్రీధర్ బాబు

Sridhar Babu : మేడారం పండుగకు జాతీయ హోదా కల్పించాలి.. మంత్రి శ్రీధర్ బాబు

Sridhar Babu : మేడారం పండుగకు జాతీయ హోదా కల్పించాలి.. మంత్రి శ్రీధర్ బాబు
X

మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని చాలా రోజులుగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తే నిధులతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మేడారం జాతరకు వచ్చే లక్షలాది భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని అన్నారు. గిరిజనులకు సంబంధించిన ఓ ప్రత్యేక పండుగ కాబట్టి జాతీయ హోదా ఇస్తే వాళ్లను గౌరవించినట్లు ఉంటుందని అన్నారు. లక్షలాదిమంది గిరిజన ప్రజలు జాతీయ హోదా ఇస్తే సంతోషపడుతారని అన్నారు. వాళ్ల మనోభావాలను గుర్తించే రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను స్టేట్ ఫెస్టివల్ గా గుర్తించామని అన్నారు.

పండుగలకు జాతీయ హోదా అనేది ఏమీ ఉండదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని, కానీ కేంద్రం తలచుకుంటే మేడారం జాతర అభివృద్ధికి పూనుకోవచ్చని అన్నారు. యావత్ దేశానికి సంబంధించిన ఆదివాసి జాతర మేడారం అన్న మంత్రి.. కేంద్రం అనుకుంటే మేడారం ప్రాంతాన్ని టూరిస్టు ప్లేస్ గా అభివృద్ధి చేయవచ్చని అన్నారు. కానీ మేడారం జాతరకు రూ.3 కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుందని అన్నారు.దీన్ని రాజకీయం చేయదలచుకోలేదన్ని శ్రీధర్ బాబు.. మేడారం పండుగను జాతీయ పండుగా గుర్తించాలని మరోసారి డిమాండ్ చేశారు. ఇక ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

మేడారం జాతరకు అధిక నిధులు కేటాయించడంతో పాటు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాగా నిన్న మేడారం జాతరకు వచ్చి వనదేవతలను దర్శించుకున్న అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ హోదా అనే విధానం ఏమీలేదని, ఇంతవరకు ఏం పండుగకు కూడా అలాంటి హోదా కల్పించలేదని స్పష్టం చేశారు. మేడారం జాతరకు అంతర్జాతీయ హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల కృషి చేస్తుందని అన్నారు. ఇక ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి త్వరలోనే ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారని, భవనం నిర్మాణం అయ్యేవరకు తాత్కాలిక క్యాంపస్ లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభం అవుతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.




Updated : 23 Feb 2024 11:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top