Home > ఆంధ్రప్రదేశ్ > Nagababu : మెగా ఫ్యాన్స్తో నాగబాబు భేటీ.. వైసీపీని గద్దె దించాలంటూ పిలుపు

Nagababu : మెగా ఫ్యాన్స్తో నాగబాబు భేటీ.. వైసీపీని గద్దె దించాలంటూ పిలుపు

Nagababu : మెగా ఫ్యాన్స్తో నాగబాబు భేటీ.. వైసీపీని గద్దె దించాలంటూ పిలుపు
X

వైసీపీని గద్దె దించాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు మెగా ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు. అనకాపల్లిలో జరిగిన మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంలో నాగబాబు పాల్గొని మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏ రాష్ట్రంలో కూడా వైసీపీ లాంటి చెత్త ప్రభుత్వాన్ని చూడలేదని అన్నారు. ప్రజా ధనంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తాతలు, తండ్రులు, తన పేర్లు పెట్టుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వచ్చేది జనసేన-టీడీపీ ప్రభుత్వమేనని, ప్రజా ప్రభుత్వంలో ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసిన మహానీయుల పేర్లను సంక్షేమ పథకాలకు పెడతామని అన్నారు. అవినీతితో కుళ్లిపోయిన వైసీపీ సర్కార్ ను గద్దె దించి... రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మరో రెండు నెలలు అందరం కలిసికట్టుగా పనిచేస్తే వైసీపీ దుష్టపాలన నుంచి విముక్తి పొందవచ్చని అన్నారు.

ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి రాజకీయ నాయకులే కారణమని, ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని వేలకోట్లు దోచుకున్నారని అన్నారు. ఒకవైపు జీవనదులు ప్రవహిస్తోన్నా రైతులకు సాగు నీరు అందడం లేదని, చక్కెర పరిశ్రమలు మూతపడి రైతులు, కార్మికులు రోడ్డున పడ్డాడరని అన్నారు. చాలా గ్రామాల్లో తాగు నీరు అందడం లేదని, కాలుష్యం ప్రాణాలు కబలిస్తోందని అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్లిపోతున్నారన్న ఆయనన.. ఇక్కడి రాజకీయ నాయకులకు భూములు కబ్జా చేయడంలో ఉన్న శ్రద్ద ప్రజా సమస్యలను పరిష్కరించడంలో లేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోవడానికి బలమైన కారణం ఉంది. ప్రతి యుగంలో దేవుళ్ల కన్నా రాక్షసులకు కాస్త శక్తి ఎక్కువగా ఉంటుందని అన్నారు. రాక్షసులను వధించి ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలో కొంతమంది వ్యక్తులు పుడతారని అన్నారు. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు పుట్టినట్లు... కలియుగంలో వైసీపీ దుష్టపాలనను అంతమొందిచడానికి పవన్ కల్యాణ్ వచ్చారని అన్నారు. ఆయనకు అండగా నిలబడి దుష్ట వైసీపీని ఇంటికి పంపించే వరకు అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు వస్తుందని అన్నారు. తమ హీరో హీరో సినిమా వచ్చినప్పుడు మాత్రమే తాము మెగా ఫ్యాన్స్ అని.. రాజకీయాలకు వచ్చే సరికి మాత్రం అందరం జనసైనికులం, వీరమహిళలమని గుర్తుంచుకోవాలని అన్నారు.

Updated : 18 Feb 2024 3:25 PM GMT
Tags:    
Next Story
Share it
Top