తిరుమలలో డ్రోన్ కలకలం
Vijay Kumar | 12 Jan 2024 8:04 PM IST
X
X
తిరుమలలో మరోసారి విజిలెన్స్ నిఘా వైఫల్యం బయటపడింది. తిరుమలలో మరోసారి డ్రోన్ కెమెరా ఎగురవేత కలకలం సృష్టించింది. తిరుమలలోని ఘాట్రోడ్డులో 53వ మలుపు వద్ద ఓ వ్యక్తి డ్రోన్ కెమెరాతో పరిసరాలను చిత్రీకరించడం వివాదస్పదమైంది. ఆ దృశ్యాలను కొందరు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి టీటీడీ విజిలెన్స్కు సమాచారం ఇవ్వడంతో అధికారులు రంగంలోకి దిగారు. విషయం తెలుసుకున్న టీటీడీ(TTD) విజిలెన్స్ అధికారులు డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకుని భక్తులను విచారిస్తున్నారు.వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని హర్యానాకు చెందిన దినేష్గా గుర్తించారు. ఆయన ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్గా పనిచేస్తున్నారు. నిబంధనలపై అవగాహన లేకే డ్రోన్ను ఎగురవేశారని అందులో ఎలాంటి కుట్ర లేదని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు.
Updated : 12 Jan 2024 8:04 PM IST
Tags: vigilance surveillance Tirumala drone camera Ghat Road TTD vigilance Dinesh Haryana Indian Army
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire