Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబు ఫోటోను నేలకేసి కొట్టిన రాయపాటి

చంద్రబాబు ఫోటోను నేలకేసి కొట్టిన రాయపాటి

చంద్రబాబు ఫోటోను నేలకేసి కొట్టిన రాయపాటి
X

టీడీపీకి మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. అయితే పార్టీకి రాజీనామా చేసిన అనంతరం రంగారావు వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం రంగారావు తన నివాసంలో ఉన్న చంద్రబాబు ఫోటోను కోపంతో నేలకేసి కొట్టారు. ఈ క్రమంలోనే మంగళగిరిలో లోకేశ్ ఎలా గెలుస్తాడో చూస్తా అంటూ సవాలు విసిరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈసారి రాయపాటి రంగారావు సత్తెనపల్లి సీటు ఆశించగా కన్నా లక్ష్మీనారాయణను టీడీపీ అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించింది. దీంతో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న రంగారావు ఇవాళ టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం టీడీపీ జాతీయ అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబును విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు.




Updated : 12 Jan 2024 9:49 PM IST
Tags:    
Next Story
Share it
Top