వ్యూహం సినిమా మళ్లీ వాయిదా.. ఆర్జీవీ ఎలా రియాక్ట్ అయ్యారంటే?
X
వ్యూహం, శపథం సినిమాల విడుదల మళ్లీ వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆర్జీవీ ఎక్స్ వేదికగా స్వయంగా ప్రకటించారు. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వ్యూహం సినిమా మార్చి 1, శపథం సినిమా మార్చి 8కి వాయిదా పడినట్లు తెలిపారు. ఇక తన సినిమాల విడుదల వాయిదా పడిన నేపథ్యంలో ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈసారి తన సినిమా విడుదల కాకపోవడానికి నారా లోకేశ్ మాత్రం కాదంటూ సెటైర్ వేశారు. ఫిబ్రవరి 23న వ్యూహం సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఆ రోజు మొత్తం 9 సినిమాలు విడుదల అవతున్నట్లు, అనుకున్నన్ని థియేటర్లు దొరకకపోవడం వల్లే తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇక తన ఎక్స్ వేదికలో షేర్ చేసిన ఫోటోలో వ్యూహంలోని చంద్రబాబు ఫోటోను పోస్టు చేస్తూ.. ఈ టెన్షన్ తో నేపు పోయేలా ఉన్నా అంటూ కామెంట్ పెట్టారు. కాగా వ్యూహం సినిమాను గతంలో నారా లోకేశ్ ఫిర్యాదు ఆగిపోయిన వ్యూహం సినిమా రిలీజ్.. ఈ నెల 23కి వాయిదా పడింది. అయితే తాజాగా ఆ సినిమా విడుదల మార్చి 1కి మారగా.. ఆ రోజైనా కచ్చితంగా విడుదల అవుతుందనే నమ్మకం తమకైతే లేదని ప్రేక్షకులు అంటున్నారు.