Home > ఆంధ్రప్రదేశ్ > Sharmila : జగన్ పార్టీకి కొత్త నిర్వచనం చెప్పిన షర్మిల

Sharmila : జగన్ పార్టీకి కొత్త నిర్వచనం చెప్పిన షర్మిల

Sharmila : జగన్ పార్టీకి కొత్త నిర్వచనం చెప్పిన షర్మిల
X

ఇటీవల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల దూసుకుపోతున్నారు. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల మీద విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు నిజమైన వారసురాలిని తానేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా తాజాగా జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షర్మిల కొత్త నిర్వచనం ఇచ్చారు. జగన్ YSR పార్టీలో Y అంటే వైవీ సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణారెడ్డి అంటూ కొత్త అర్థాన్ని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేరని, ఇది జగన్ రెడ్డి పార్టీ అని అన్నారు. జగన్ పార్టీ నియంత పార్టీ అని, ప్రజలను పట్టించుకోని పార్టీ అని అన్నారు. ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిసైన పార్టీ జగన్ వైఎస్ఆర్ పార్టీ అంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

ఏపీకి ప్రత్యక హోదా రావాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రం విడిపోయాక టీడీపీ, వైసీపీకి చెరో అవకాశం ఇచ్చారని.. కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక్క అవకాశం ఇవ్వాలని షర్మిల కోరారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. జీవితాంతం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పని చేశారన్న షర్మిల.. ఆయన వారసురాలిగా తానూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు.




Updated : 27 Jan 2024 9:37 AM GMT
Tags:    
Next Story
Share it
Top