Home > ఆంధ్రప్రదేశ్ > జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది.. ఏపీసీసీ చీఫ్ షర్మిల

జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది.. ఏపీసీసీ చీఫ్ షర్మిల

జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది.. ఏపీసీసీ చీఫ్ షర్మిల
X

జగన్ ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. డీఎస్సీ నోటిఫికేషన్ విషయంలో సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించిన షర్మిల, ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ జగన్ ప్రభుత్వపై నిప్పులు చెరిగారు. జగన్ పార్టీ ప్రత్యేక రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని అన్నారు. పూర్తి చేయని హామీలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి నిర్బంధిస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా తనకే ఈ పరిస్థితి ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటీ అని ప్రశ్నించారు. ఏపీలో పరిస్థితి చూస్తే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక రాచరికపు పాలన లో ఉన్నామా అనే సందేహం కలుగుతోందని అన్నారు.

మెగా డీఎస్సీ కావాలి దగా డీఎస్సీ వద్దు అని ప్రభుత్వానికి రిప్రెజెంటేషన్ ఇద్దామని వెళ్తున్నతనతో సహా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమ అరెస్ట్ చేసి భౌతిక దాడికి పాల్పడి గాయపరచడం బాధ కలిగించిందని అన్నారు. ఏపీలో ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్చ లేదు... వినతి పత్రం తీసుకోవడానికి సచివాలయంలో ఒక్కరూ కూడా లేరట అని అన్నారు. సీఎం రాడు.. మంత్రులు లేరు.. అధికారులు రారు.. వీళ్లకు పాలన చేతకాదు అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని వైసీపీ పాలకులు గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

కాగా మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో షర్మిలతో పాటు కాంగ్రెస్ నేతలు సెక్రటెరియట్ ఎదుట ఆందోళనకు దిగారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయటు దేరారు. అయితే పలు చోట్ల వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ నేతలు, వైఎస్ షర్మిల రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో వారిని అడ్డుకునేందుకు అమరావతి కరకట్టపై పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. మెగా డీఎస్సీ కోసం ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ధర్నాకు వచ్చిన షర్మిల కారు దిగగానే వెంటనే పోలీసులు చుట్టుముట్టి బలవంతంగా అరెస్టు చేశారు. షర్మిలతో పాటు కార్యకర్తలు, నాయకులను అరెస్ట్ చేసి దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.



Updated : 22 Feb 2024 11:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top