Home > ఆంధ్రప్రదేశ్ > ఫ్యాన్‌ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాలి.. జగన్ కు లోకేశ్ కౌంటర్

ఫ్యాన్‌ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాలి.. జగన్ కు లోకేశ్ కౌంటర్

ఫ్యాన్‌ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాలి.. జగన్ కు లోకేశ్ కౌంటర్
X

ఫ్యాన్ ఇంట్లో.. సైకిల్ బయట.. టీ గ్లాస్ సింక్ లో ఉండాలి అంటూ నిన్న సిద్ధం సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. ఫ్యాన్ రెక్కలను విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ నగరంతో ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో మాట్లాడిని లోకేశ్ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ప్రశాంత వాతావరణం ఉన్న వైజాగ్ ను వైసీపీ నేతలు విషాదనగరంగా మార్చేశారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రమే జగన్‌ అని విమర్శించారు. నవరత్నాల పేరిట నవమోసాలు చేశారని ఘాటుగా విమర్శలు గుప్పించారు. సీఎం వైఎస్ జగన్ సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయలేదు కానీ.. మందులో కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారని సెటైర్లు వేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని సరిగ్గా అమలు చేయలేదన్నారు. ఆ పథకాన్ని అనారోగ్యశ్రీగా మార్చేశారని అన్నారు. అందుకే ఫ్యాన్‌ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో వేయాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టంచేశారు.

రూ.5 ఇస్తే పేటీఎం బ్యాచ్‌ ఏపనైనా చేస్తుందని ఆరోపించారు. ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. అందుకోసం 2 నెలలు ఓపిక పట్టాలని కార్యకర్తలకు సూచించారు. టీడీపీ- జనసేన శ్రేణుల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్ చెప్పినట్లుగా ‘హలో ఏపీ.. బైబై వైసీపీ’ నినాదానికి కట్టుబడి ఉండాలని టీడీపీ-జనసేన కార్యకర్తలకు సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించి తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రెడ్‌ బుక్‌లో ఉన్నాయని హెచ్చరించారు. వడ్డీతో సహా చెల్లించే బాధ్యతను తానే తీసుకుంటానని లోకేశ్‌ అన్నారు. ఏపీలో జగన్ చాప్టర్ క్లోజ్ అయిందని, ప్రజలు ఇంకో రెండు నెలలు ఓపికపడితే చాలు జగన్ పీడ పోతుందని అన్నారు.

Updated : 19 Feb 2024 10:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top