రాయుడు రాజీనామాపై చంద్రబాబు రియాక్షన్ ఇదే
X
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన రాజీనామాపై స్పందిస్తున్నారు. తాజాగా రాయుడు రాజీనామాపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో రాయుడి రాజీనామాపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయుడికి గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పి సీఎం జగన్ మాట తప్పారని ఆరోపించారు. కానీ ఆ స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చి రాయుడిని జగన్ మోసం చేశారని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అవడం ఖాయమని తెలుసుకుని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ కనుమరుగవడం ఖాయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అవుతుందని ముందే గ్రహించి రాయుడు వైసీపీకి రాజీనామా చేశారని అన్నారు. వైసీపీ ఇంఛార్జుల మార్పుపై ఆయన విమర్శలు చేశారు. ఒక నియోజకవర్గంలోని చెత్త పక్క నియోజకవర్గంలో బంగారం అవుతుందా అని ప్రశ్నించారు.