ఏపీ మహిళలకు టీడీపీ కీలక హామీ.. అధికారంలోకి వస్తే..
Vijay Kumar | 1 Jan 2024 8:33 PM IST
X
X
ఏపీ మహిళలకు తెలుగుదేశం పార్టీ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి అధికారంలోకి రాగానే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ 'మహాశక్తి' పేరు మీద రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తామని ఎన్నికల హామీని ప్రకటించింది. ఈ మేరకు అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా టీడీపీ విడుదల చేసింది. కాగా 6 గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పేరుతో తెలంగాణ ప్రభుత్వం మహిళలందరికీ ఫ్రీ బస్ జర్నీ అవకాశం కల్పించింది. దీనికి మహిళల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మొట్టమొదటి సారి ఈ పథకాన్ని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది.
Updated : 1 Jan 2024 8:36 PM IST
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire