Home > ఆంధ్రప్రదేశ్ > AP Bandh : జనవరి 24న రాష్ట్ర బంద్.. ఎందుకంటే?

AP Bandh : జనవరి 24న రాష్ట్ర బంద్.. ఎందుకంటే?

AP Bandh : జనవరి 24న రాష్ట్ర బంద్.. ఎందుకంటే?
X

వేతనాలు పెంచాలంటూ ఏపీలో ధర్నా చేస్తున్న అంగన్వాడీలను అక్కడి ప్రభుత్వం తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో అంగన్వాడీలు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ తీరుకు నిరసనగా పలు కార్మిక సంఘాలు ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24న ఏపీ బంద్ కు పిలుపునిచ్చాయి ఏపీ ట్రేడ్ యూనియన్లు. 24న అందరూ బంద్ పాటించాలని పలు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. తమ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని అంగన్వాడీలు కోరారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు పోరాటం కొనసాగుతుందని అంగన్వాడీలు స్పష్టం చేశారు.

కాగా వేతనాలు పెంచాలంటూ గత కొంతకాలంగా విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్న అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో చేరని వారిపై వేటు వేసేందుకు సిద్దమైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు చోట్ల అంగవ్వాడీలపై వేటు వేశారు. మన్యం జిల్లా, విజయవాడ జిల్లాలో వర్కర్లు, హెల్పర్లను తొలిగిస్తూ కలెక్టరులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఎస్మా చట్టం ప్రకారం వారికి నోటీసులు జారీ చేశారు. అయినా అంగన్ వాడీలు వెనక్కి తగ్గలేదు. తమ సమస్యలు పరిష్కరించాల్సిందేనని పట్టుబడ్డారు. అంతేకాదు ఆందోళనలను మరింత ఉధృతం చేశారు.




Updated : 22 Jan 2024 3:21 PM GMT
Tags:    
Next Story
Share it
Top