Home > ఆంధ్రప్రదేశ్ > ఇకపై స్కూళ్లలో వాటర్ బ్రేక్.. ఎక్కడంటే?

ఇకపై స్కూళ్లలో వాటర్ బ్రేక్.. ఎక్కడంటే?

ఇకపై స్కూళ్లలో వాటర్ బ్రేక్.. ఎక్కడంటే?
X

సాధారణంగా పాఠశాలల్లో లంచ్ బ్రేక్, టాయిలెట్ బ్రేక్ ఉంటాయనేది అందరికీ తెలుసు. కానీ వాటర్ బ్రేక్ కూడా తీసుకోవచ్చని కేరళ ప్రభుత్వం మరోసారి నిరూపించింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో స్కూళ్లలో వాటర్ బ్రేక్ ఇవ్వనున్నట్లు కేరళ గవర్నమెంట్ ప్రకటించింది. వేసవిలో విద్యార్థులు డీహైడ్రేషన్ కు గురవకుండా ఉండటానికి తగినంత నీరు తాగేలా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాలల్లో వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు ఈ నెల 20 నుంచి పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేస్తామని కేరళ విద్యాశాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా బడుల్లో ఉదయం 10.30, మధ్యాహ్నం 2.30 గంటలకు ఐదు నిమిషాల పాటు విద్యార్థులకు నీరు తాగడానికి విరామం ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనివల్ల విద్యార్థులు డీహైడ్రేషన్, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని పేర్కొంది. 2019లో దేశంలో మొదటిసారి ఈ విధానాన్ని కొన్ని పాఠశాలల్లో ప్రారంభించామని కేరళ విద్యాశాఖ తెలిపింది. అనంతరం ఈ విధానాన్ని కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు అమలు చేశాయని పేర్కొంది.

Updated : 17 Feb 2024 2:13 PM GMT
Tags:    
Next Story
Share it
Top