Kodali Nani : రేవంత్ రెడ్డిపై కొడాలి నాని సంచలన కామెంట్స్
X
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తుంటి ఎముక విరిగి ఉంటే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయనను పరామర్శించి ఉండేవారని అన్నారు. మొన్న ఓ ప్రముఖ తెలుగు ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. తాను సీఎం అయితే కనీసం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కనీసం ఫోన్ చేసి శుభాకాంక్షలు కూడా చెప్పలేదని అన్నారు. ఇదే విషయాన్ని ఓ జర్నలిస్ట్ కొడాలి నానిని అడగగా మాజీ సీఎం కేసీఆర్ కు తుంటి ఎముక విరిగితే ఏపీ సీఎం జగన్ ఆయన్ను కలిసి పరామర్శించారని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా తుంటి ఎముక విరిగి ఉంటే తమ సీఎం జగన్ ఆయనను కలిసి ఉండేవారని ఎద్దేవా చేశారు. కాగా సీఎం రేవంత్ రెడ్డిపై కొడాలి నాని చేసిన ఈ కామెంట్స్ పై టీ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. కొత్తగా సీఎం అయిన ఓ వ్యక్తి తమ పక్క రాష్ట్రం సీఎం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపలేదనడంలో ఏం తప్పు ఉందని ప్రశ్నించారు. హైదరాబాద్ కు వచ్చి మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన ఏపీ సీఎం జగన్.. కనీసం ఫోన్ ద్వారా తెలంగాణ సీఎంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపితే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.