Home > ఆంధ్రప్రదేశ్ > కుటుంబ సభ్యులతో షర్మిల క్రిస్మస్ సెలబ్రేషన్స్

కుటుంబ సభ్యులతో షర్మిల క్రిస్మస్ సెలబ్రేషన్స్

కుటుంబ సభ్యులతో షర్మిల క్రిస్మస్ సెలబ్రేషన్స్
X

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుటుంబ సభ్యులతో క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. రాజకీయాల వల్ల క్షణం తీరిక లేకుండా గడిపే ఆమె.. భర్త అనిల్, కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలిరెడ్డితో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యుల నడుమ క్రిస్మస్ వేడుకులను ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె ఎక్స్ వేదికగా పంచుకున్నారు. చాలా కాలం తర్వాత కుటుంబ సభ్యులతో క్రిస్మస్ పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ప్రభువు ఏసుక్రీస్తు ఆశీస్సులతో రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. కాగా ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ తంతు ముందుకు వెళ్లలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. మొత్తానికి ఈ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ నుంచి ఎవరూ పోటీ చేయలేదు.




Updated : 25 Dec 2023 5:11 PM IST
Tags:    
Next Story
Share it
Top