Home > ఆంధ్రప్రదేశ్ > ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీలకు సపోర్టు చేయొద్దు.. వైఎస్ షర్మిల

ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీలకు సపోర్టు చేయొద్దు.. వైఎస్ షర్మిల

ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీలకు సపోర్టు చేయొద్దు.. వైఎస్ షర్మిల
X

ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడని పార్టీలకు.. ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీలకు వచ్చే ఎన్నికల్లో సపోర్టు చేయవద్దని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో షర్మిల పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. అన్ని వర్గాల వారి కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని, కానీ కొందరు నియంతలుగా మారి రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే ఒక్క రోజు జెండా ఎగర వేయడం, ఆయన భారీ విగ్రహాలు పెట్టడం కాదని అన్నారు. వీటి వల్ల అంబేద్కర్ ఆశించిన సోషల్ జస్టిస్ రాదన్న షర్మిల.. అన్ని వర్గాలను గౌరవించినప్పుడే అంబేద్కర్ ఆశయాలను అమలు చేసినట్లు అని అన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు వందశాతం పెరిగాయని, ప్రశ్నిస్తే చంపేస్తున్నారని అన్నారు. కనీసం సబ్ ప్లాన్ నిధులు కూడా వారికి చేరకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీలకు మద్దతు ఇవ్వబోమని, పోలవరం కోసం కొట్లాడని పార్టీలకు సపోర్ట్ చేయమని రాష్ట్ర ప్రజలు ప్రమాణం చేయాలని షర్మిల కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత వరకైనా పోరాటం చేస్తుందని అన్నారు. కాగా అంతకుముందు మాట్లాడిన షర్మిల.. తమ కుటుంబం విడిపోవడానికి తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డియే కారణమని అన్నారు. తన అన్న జగన్ చెబితేనే తాను వైసీపీ తరఫున ఓదార్పు యాత్ర చేశానే తప్ప.. తానూ యాత్ర చేస్తానని ఆయనను ఏనాడు సంప్రదించలేదని అన్నారు. వీటన్నింటికీ తమ తల్లి విజయమ్మే సాక్ష్యమని షర్మిల అన్నారు.



Updated : 26 Jan 2024 4:12 PM IST
Tags:    
Next Story
Share it
Top