Home > ఆంధ్రప్రదేశ్ > ప్రత్యేక హోదా కోసం జాతీయ నాయకులను కలిసిన షర్మిల

ప్రత్యేక హోదా కోసం జాతీయ నాయకులను కలిసిన షర్మిల

ప్రత్యేక హోదా కోసం జాతీయ నాయకులను కలిసిన షర్మిల
X

ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న షర్మిల రాజకీయంగా దూసుకుపోతున్నారు. ఏపీ విభజన చట్టంలోని పలు హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల ఇవాళ ఢిల్లీలో దీక్షకు దిగారు. అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా కోసం పలువురు జాతీయ నాయకులను కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్ లో ఒత్తిడి పెంచేందుకు ఈరోజు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలను షర్మిల కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని చెప్పిన మోడీ ఇప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, కడప స్టీల్ ప్లాంట్.. ఇలా ఏ ఒక్క హామీ అమలుకు మోడీ ప్రభుత్వం సహకరించలేదని వివరించారు.

ప్రత్యేక హోదా కాదు కదా ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వలేదని అన్నారు. బుందేల్ ఖండ్ తరహాలో రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని అన్నారు. వైజాగ్-చెన్నై కారిడార్ ను ఏర్పాటు చేయలేదని అన్నారు. ఏపీని బీజేపీ ప్రభుత్వం ఇలా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటే రాష్ట్రంలోని అన్ని పార్టీలు మాత్రం బీజేపీకి బేషరతుగా మద్దతివ్వడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేసే వరకు కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని షర్మిల స్పష్టం చేశారు.




Updated : 2 Feb 2024 9:22 PM IST
Tags:    
Next Story
Share it
Top