సెక్యూరిటీ పెంచాలంటూ డీజీపీకి షర్మిల లేఖ
Vijay Kumar | 31 Jan 2024 6:20 PM IST
X
X
తనకు భద్రతను పెంచాలంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ డీజేపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. తనకు 4+4 సెక్యూరిటీ కల్పించాలని పేర్కొన్నారు. గతంలో నాకు 4+4 సెక్యూరిటీ ఉండేదని గుర్తు చేశారు. ఏపీసీసీ చీఫ్ గా ప్రజాక్షేత్రంలో చురుకుగా ఉంటున్న ఈ తరుణంలో తన సెక్యూరిటీని 2+2 కు తగ్గించారని, తాజాగా 1+1కు తగ్గించారని గుర్తు చేశారు. ఎన్నికల నేపథ్యంలో తాను నిత్యం ప్రజల్లో తిరుగుతున్నానని, ఈ క్రమంలోనే అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి తన భద్రతక భంగం వాటిల్లుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తనకు తక్షణమే 4+4 సెక్యూరిటీతో పాటు ఓ ఎస్కార్ట్ వాహనాన్ని కల్పించాలని షర్మిల డీజీపీని కోరారు.
Updated : 31 Jan 2024 6:20 PM IST
Tags: apcc chief YS Sharmila letter AP DGP rajendranath reddy security assembly elections parliament elections
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire