Higher Education Council : ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం
X
2024-25 విద్యాసంవత్సరానికి గానూ కామన్ ఎంట్రెన్స్ టెస్టులకు సంబంధించిన కన్వీనర్లను నియమిస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్ ను ఎప్‌సెట్ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయగా..
ఎప్‌సెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ బీ డీన్ కుమార్‌కు తెలంగాణ ఉన్నత విద్యామండలి బాధ్యతలు అప్పగించింది.
పీజీఈసెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ అరుణ కుమారి, ఐసెట్ కన్వీనర్‌గా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారిలను నియమించింది. ఇక ఈసెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, లాసెట్, పీజీ ఎల్‌సెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ విజయలక్ష్మి, ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ మృణాళిని, పీఈసెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్ లు నియామకమయ్యారు.
కాగా ఇప్పటికే పలు ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించిన విషయం తెలిసిందే. మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 6వ తేదీన టీఎస్ ఈసెట్, జూన్ 4వ తేదీన టీస్ ఐసెట్, జూన్ 6 నుంచి 8 వరకు టీఎస్ పీజీఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసింది.