Home > సినిమా > మరికొన్ని గంటల్లో 2023కి గుడ్ బై.. బలగం డైరెక్టర్ ఏమన్నాడంటే?

మరికొన్ని గంటల్లో 2023కి గుడ్ బై.. బలగం డైరెక్టర్ ఏమన్నాడంటే?

మరికొన్ని గంటల్లో 2023కి గుడ్ బై.. బలగం డైరెక్టర్ ఏమన్నాడంటే?
X

ఇంకో కొన్ని గంటల్లో 2023కి గుడ్ బై చెప్పేందుకు ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదరుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఈ ఏడాదిలోని తీపి చేదు స్మృతులను నెమరువేసుకుంటున్నారు. ఇదే పని చేశాడు బలగం మూవీ డైరెక్టర్ వేణు. 2023ను తన జీవితంలో మరిచిపోలేనని అన్నాడు. తన జీవితంలో ఆనందాల్ని నింపిన సంవత్సరం 2023 అని అన్నాడు. ఈ ఏడాది తాను డైరెక్ట్ చేసిన 'బలగం' మూవీని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని ఆనందం వ్యక్తం చేశాడు.

తన సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షకదేవుళ్లకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. అలాగే ఈ ఏడాది తనకుఇంకో మధురమైన గుర్తును మిగిల్చిందన్న వేణు.. ఈ ఏడాది తన కూతురు పుట్టుకతో తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. తన ఈ ఆనందానికి కారణమైన తన భార్యకు వేణు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా వేణు డైరెక్షన్ లో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'బలగం' మూవీ ప్రతి ఒక్కరిని కండతడి పెట్టించడమే కాకుండా ఆలోచింపచేసింది. కుటుంబ బాంధవ్యాల గొప్పతనం గురించి చాలా సున్నితంగా చెప్పింది 'బలగం' మూవీ. అందుకే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అవార్డుల మీద అవార్డులు వచ్చాయి.

Updated : 31 Dec 2023 7:45 PM IST
Tags:    
Next Story
Share it
Top