Home > సినిమా > సీఎం రేవంత్ను కలిసిన హీరో నాగార్జున

సీఎం రేవంత్ను కలిసిన హీరో నాగార్జున

సీఎం రేవంత్ను కలిసిన హీరో నాగార్జున
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని హీరో అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అమల మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సీఎం నివాసానికి వచ్చిన నాగార్జున దంపతులు సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు సీఎంకు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలను సీఎం రేవంత్ హీరో నాగార్జునను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ కు సంబంధించిన పలు సమస్యలను నాగార్జున సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే పలు రాజకీయ పార్టీల నాయకులతో పాటు సినీ ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విషెస్ చెప్పారు.

Updated : 30 Dec 2023 9:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top