Hero Nagarjuna : మాల్దీవుల ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకున్న హీరో నాగార్జున
X
మాల్దీవుల పర్యటనను టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున రద్దు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కుటుంబంతో కలిసి ఈ నెల 17న మాల్దీవులకు వెళ్లాల్సి ఉండేనని తెలిపారు. కానీ భారత ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు తననెంతో బాధించాయని అన్నారు. 150 కోట్ల మందికి మోడీ నాయకుడని, ప్రపంచ దేశాధినేతలు ఆయనకు తగిన గౌరవం ఇస్తారని అన్నారు. ప్రధాని మోడీని కించపరిచేలా మాల్దీవుల మంత్రులు మాట్లాడారని, అందుకు ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. లక్షద్వీప్ ఎంతో అందమైన ప్రదేశమని, కుటుంబంతో కలిసి త్వరలోనే అక్కడికి వెళ్తామని నాగార్జున తెలిపారు. ఇక మాల్దీవ్స్ ట్రిప్ ను నాగార్జున క్యాన్సిల్ చేయడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సెలబ్రిటీలందరూ ఈ నిర్ణయం తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు ఇండియా తన వ్యూహాత్మక నిర్ణయాలతో సమాధానమిస్తోంది. లక్షద్వీప్ లో మాల్దీవులకు ధీటుగా టూరిజంను డెవలప్ చేయడంపై ఇండియా దృష్టి పెట్టింది.