Home > సినిమా > Venkatesh : సీఎం రేవంత్ను కలిసిన హీరో వెంకటేశ్

Venkatesh : సీఎం రేవంత్ను కలిసిన హీరో వెంకటేశ్

Venkatesh : సీఎం రేవంత్ను కలిసిన హీరో వెంకటేశ్
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్, ఆయన సోదరుడు సురేశ్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సీఎం నివాసానికి వచ్చిన వెంకటేశ్, సురేశ్ బాబు సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు సీఎంకు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలను సీఎం రేవంత్ వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ కు సంబంధించిన పలు సమస్యలను వెంకటేశ్, సురేశ్ బాబు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం.

కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే పలు రాజకీయ పార్టీల నాయకులతో పాటు సినీ ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జున, బాలకృష్ణ తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విషెస్ చెప్పారు.




Updated : 27 Jan 2024 3:43 PM IST
Tags:    
Next Story
Share it
Top