Home > సినిమా > చిరంజీవి రియల్ హీరో.. గవర్నర్ తమిళిసై

చిరంజీవి రియల్ హీరో.. గవర్నర్ తమిళిసై

చిరంజీవి రియల్ హీరో.. గవర్నర్ తమిళిసై
X

టాలీవుడ్ అగ్రహీరో, మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మ విభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు ప్రముఖుల నుంచి ప్రశంసలు, సత్కారాలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ గవర్నర్ తమిళిసై తన అధికార నివాసంలో ఘనంగా సన్మానించారు. ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవికి గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ చిరంజీవి హీరోనేనని అన్నారు. చిరంజీవి లాంటి వ్యక్తిని సన్మానించడం సంతోషంగా ఉందని అన్నారు. ఎంతో మంది యువ కళాకారులకు చిరంజీవి ఆదర్శమని అన్నారు. కోట్ల కొద్దీ అభిమానులు ఆయన సొంతమని, అలాంటి వ్యక్తిని సన్మానించడం సంతోషంగా ఉందని అన్నారు.

చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించినప్పటి నుంచి ఆయనతో కలిసి మాట్లాడాలి అని ఎంత అనుకున్నా కుదరలేదని అన్నారు. కానీ నేటితో ఆ బాధ తీరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సతీమణి సురేఖ కూడా ఉన్నారు. కాగా పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఆయనతో పాటు పద్మ విభూషణ్ కు ఎంపికైన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పద్మశ్రీ అవార్డు అందుకున్న మరో ఆరుగురి తెలుగు వాళ్లను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది.

Updated : 10 Feb 2024 2:59 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top