2024 ఆస్కార్ నామినేషన్స్ కు తెలుగు సినిమా
X
2023 తెలుగు సినిమాకు మరిచిపోలేని ఏడాది. గతేడాది తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎన్నో గొప్ప విజయాలను అందుకుంది. అందులో అతి ముఖ్యమైనది RRR మూవీ. గత ఏడాది నిర్వహించిన 95th అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో RRR సినిమాలోని “నాటు నాటు” పాట ఆస్కార్ గెల్చుకున్న మొదటి భారతీయ సినిమా పాటగా చరిత్ర సృస్థించింది మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఈ పాటకు ఆస్కార్ పురస్కారాన్నీ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మాత్రమే కాదు భారత దేశం నుంచి ఎలిఫాంట్ విస్పర్స్ అనే డాక్యుమెంట్రీ ఫిలిం కూడా ఆస్కార్ అవార్డును అందుకుంది. అయితే 2024గానూ ఇండియా ఆస్కార్ అవార్డుల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. ఈసారి ఆస్కార్ నామినేషన్లకు ఓ తెలుగు సినిమా కూడా ఎంపికైంది. నేచురల్ స్టార్ నాని, మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో రూపొందించిన 'దసరా' మూవీ ఇండియా నుంచి ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో నాని తన టైటిల్ కు తగ్గట్టు చాలా నేచరల్ గా నటించాడు. ఇక ఆయనకు పర్ఫెక్ట్ జోడీగా కీర్తి సురేశ్ నిలిచింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చూసిన ఈ మూవీ హిట్ గా నిలిచింది. ఇక దక్షిణాది నుంచి విడుతలై పార్ట్ 1 (తమిళ్)కూడా ఇండియా నుంచి ఆస్కార్ కు నామినేట్ అయింది. హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషలకు చెందిన చిత్రాలు ఇప్పటి వరకు 2024 ఆస్కార్ కు నామినేట్ అయ్యాయి. ఇంకా పలు సినిమాలు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.
ఆస్కార్ కు నామినేట్ అయిన మూవీస్ ఇవే
.. దీ స్టోరీ టెల్లర్ (హిందీ)
.. సంగీత పాఠశాల (హిందీ)
.. శ్రీమతి ఛటర్జీ VS నార్వే (హిందీ)
.. డంకీ (హిందీ)
.. 12TH ఫెయిల్ (హిందీ)
.. విడుతలై పార్ట్ 1 (తమిళ్)
.. ఘూమర్(హిందీ)
.. దసరా (తెలుగు)
.. జ్వీగాటో (హిందీ)
.. రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ (హిందీ)
.. కేరళ స్టోరీస్ (హిందీ)