Home > సినిమా > Grammy Awards : శక్తికి గ్రామీ అవార్డు.. ప్రధాని మోడీ హర్షం

Grammy Awards : శక్తికి గ్రామీ అవార్డు.. ప్రధాని మోడీ హర్షం

Grammy Awards : శక్తికి గ్రామీ అవార్డు.. ప్రధాని మోడీ హర్షం
X

అంతర్జాతీయ వేదికపై భారతీయ కళాకారులు విజయ కేతనం ఎగురవేస్తున్నారు. గతేడాది వచ్చిన RRR మూవీ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు ఆ సినిమా గ్రామీ అవార్డులను కూడా దక్కించుకుంది. కాగా తాజాగా ఇండియాకు చెందిన పలువురు సంగీత కళాకారులకు గ్రామీ అవార్డు దక్కింది. భారతీయ సంగీత కళాకారులు జాకీర్ హుస్సేన్ (తబలా), శంకర్ మహదేవన్ (సింగర్)లు ఉన్న శక్తి బ్యాండ్ కు తాజాగా గ్రామీ అవార్డు దక్కింది. వీళ్లు కంపోజ్ చేసిన 'దిస్ మూమెంట్' ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును సొంతం చేసుకుంది. కాగా తాజాగా వీరికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.





"సంగీతం పట్ల మీ అసాధారణమైన ప్రతిభ, అంకితభావం ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్నాయి. మిమ్మల్ని చూసి భారతదేశం గర్విస్తోంది. మీ కృషికి ఈ విజయాలే నిదర్శనం" అని ప్రధాని ట్వీట్ చేశారు. ఇక దిస్ మూమెంట్ పాటన్ జాన్ మెక్ లాఫ్లిన్ (గిటార్), జాకీర్ హుస్సేన్ (తబలా), శంకర్ మహదేవన్ (సింగర్), గణేశ్ రాజగోపాలన్ (వయోలిన్) వంటి ప్రతిభావంతులైన ఎనిమిది మంది శక్తి బ్యాండ్ పేరిట కంపోజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పోటీని ఎదుర్కొని శక్తి విజేతగా నిలవడంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.




Updated : 5 Feb 2024 10:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top