Home > సినిమా > Prime Minister Modi : బాల రాముడికి మోడీ సాష్టాంగ నమస్కారం

Prime Minister Modi : బాల రాముడికి మోడీ సాష్టాంగ నమస్కారం

Prime Minister Modi  : బాల రాముడికి మోడీ సాష్టాంగ నమస్కారం
X

ఈ రోజు అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ప్రధాని మోడీ కూడా పాల్గొన్నారు. అయితే ఆలయంలోని గర్భగుడిలోకి వెళ్లిన ప్రధాని మోడీ మొదట బాల రాముడికి పట్టు వస్త్రాలు, ఛత్రం సమర్పించారు. ప్రాణ ప్రతిష్ఠలో భాగంగా రామ్ లల్లాకు 114 కలశాలలో ఔషధ జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పూజా కార్యక్రమాలు చేశారు. తర్వాత రాముడి చుట్టూ ప్రదక్షిణ చేశారు. తర్వాత బాల రాముడి పాదలకు మోడీ సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ సమయంలో మోడీ వెంట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందీ బెన్ తో పాటు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర్ ప్రతినిధులు ఉన్నారు. కాగా రాముని ప్రాణ ప్రతిష్ఠతో దేశమంతా రామ నామ స్మరణతో మార్మోగింది.




Updated : 22 Jan 2024 2:49 PM IST
Tags:    
Next Story
Share it
Top