దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్.. బెస్ట్ యాక్టర్ గా షారూఖ్ ఖాన్
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ కమిటీ అదిరిపోయే న్యూస్ అందించింది.దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ బెస్ట్ మూవీగా ప్రభాస్ నటించిన సలార్ మూవీని ఎంపిక చేసింది. ఈ మేరకు ఆ కమిటీ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక తాజాగా ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (డీపీఐఎఫ్‌ఎఫ్)-2024’లో ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సంబంధించి అవార్డుల కార్యక్రమం గత మంగళవారం ముంబైలో ఘనంగా జరిగింది. పాటు బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు టాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా ప్రముఖ యాక్టర్స్ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక ఈ అవార్డుల్లో గత ఏడాది విడుదలైన ‘జవాన్’, ‘యానిమల్’ చిత్రాలు పోటీ పడ్డాయి. జవాన్‌లో షారుఖ్ నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగా.. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును రాణి ముఖర్జీ (మిర్సస్ ఛటర్జీ వర్సెస్ నార్వే) అందుకున్నారు. ఇక గతేడాది యానిమల్ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. క్రిటిక్స్ బెస్ట్ ఫిలింగా 12th ఫెయిల్ మూవీ ఎంపికైంది. క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ గా విక్కీ కౌషల్ (సామ్ బహదూర్) నిలిచారు. ఇక క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ గా కరీనా కపూర్ ఖాన్ (జానే జాన్) నిలిచారు. క్రిటిక్స్ బెస్ట్ డైరెక్టర్ గా అట్లీ (జవాన్) నిలిచారు.