పల్లవి ప్రశాంత్ పిటిషన్ పై విచారణ పూర్తి
X
బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు రిమాండ్ నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తి అయ్యింది. విచారణ పూర్తైన తర్వాత ప్రశాంత్ లాయర్లు మీడియాతో మాట్లాడారు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అక్రమమని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్ , ఆయన సోదరుడిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. బిగ్ బాస్ రిజల్ట్స్ తర్వాత జరిగిన గొడవలో ప్రశాంత్ ఇన్ వాల్వ్ అయినట్లు ఎలాంటి రుజువులు లేవని ఆయన తరఫు లాయర్లు తెలిపారు. ఒకవేళ అలాంటి ఆధారాలు ఏమైనా ఉంటే కోర్టుకు సమర్పించాలని తెలిపారు. బిగ్ బాస్ లో తాను గెలిచిన 30 లక్షల రూపాయలను రైతులకు పంచుతానని చెప్పిన రైతు బిడ్డను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు.
ఓ కామన్ మ్యాన్ కోసం దాదాపు 50 మంది లాయర్లు రూపాయి ఫీజు తీసుకోకుండా స్వచ్ఛందంగా వాదించామని అన్నారు. బిగ్ బాస్ రిజల్ట్స్ అనంతరం జరిగిన గొడవలకు ప్రశాంత్ కు ఏం సంబంధం అని అన్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే గొడవలు జరిగాయని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పల్లవి ప్రశాంత్ ను అక్రమంగా అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ ఎస్హెచ్వోను వెంటనే సస్పెండ్ చేయాలని న్యాయవాదులు తెలిపారు. రేపు పల్లవి ప్రశాంత్ కు 100 శాతం బెయిల్ వస్తుందని అన్నారు.