Home > సినిమా > కాంగ్రెస్లో చేరిన బీజేపీ కౌన్సిలర్లు

కాంగ్రెస్లో చేరిన బీజేపీ కౌన్సిలర్లు

కాంగ్రెస్లో చేరిన బీజేపీ కౌన్సిలర్లు
X

కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. వనపర్తి మున్సిపాలిటీకి చెందిన బీజేపీ కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో బీజేపీకి చెందిన కౌన్సిలర్లు బి.రమాదేవి, బొడ్డుపల్లి పద్మ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి.కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వారంతా కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు చాలా బాగా ఉన్నాయని, జనాల్లో వాటికి మంచి స్పందన వస్తోందని అన్నారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లు వారు తెలిపారు. వచ్చే స్థానిక సంస్థలు, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.




Updated : 29 Dec 2023 8:50 PM IST
Tags:    
Next Story
Share it
Top