Home > భక్తి > రూ.5వేల కోట్లు దాటిన టీటీడీ వార్షిక బడ్జెట్.. పాలకమండలి ఆమోదం

రూ.5వేల కోట్లు దాటిన టీటీడీ వార్షిక బడ్జెట్.. పాలకమండలి ఆమోదం

రూ.5వేల కోట్లు దాటిన టీటీడీ వార్షిక బడ్జెట్.. పాలకమండలి ఆమోదం
X

తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ రూ.5వేల కోట్లు దాటింది. 2024 -25 వార్షిక బడ్జెట్కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. రూ.5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్ను రూపొందించింది. ఈ సందర్భంగా టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకునే వధేవరులకు మంగళసూత్రాల విక్రయానికి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

వేద పాఠశాలలో 51మంది అధ్యాపకుల జీతాల పెంపుకు టీటీడీ ఆమోదం తెలిపింది. దీంతో వారి జీతాలు రూ.35వేల నుంచి 54వేలకు పెరగనుంది. అదేవిధంగా టీటీడీ ఆధ్వర్యంలోని 60 ఆలయాల్లో ఉద్యోగ నియామకాల కోసం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చైర్మన్ తెలిపారు. గోగర్భం నుంచి ఆకాశగంగ వరకు ఫోర్ లేన్ రోడ్ల నిర్మాణానికి 30 కోట్లు, నారాయణవనంలో కొలువైన భధ్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయం అభివృద్ది పనులకు 6.9 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. స్విమ్స్ అభివృద్ది పనులుకు 148 కోట్లు కేటాయింపుకు ఆమోద ముద్ర వేశామన్నారు.

కేటాయింపులు

ఇంజినీరింగ్ విభాగానికి - రూ.350 కోట్లు

హిందూ ధర్మప్రచార, అనుబంధ ప్రాజెక్టులకు - రూ.108.50 కోట్లు

వివిధ సంస్థలకు గ్రాంట్స్ - రూ.113.50 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వానికి - రూ.50 కోట్లు

టీటీడీ విద్యాసంస్థలు, వివిధ వర్సిటీలకు గ్రాంట్స్ - రూ.173.31 కోట్లు

పారిశుద్ధ్య విభాగానికి - రూ.261.07 కోట్లు

భద్రతా విభాగానికి - రూ.149.99 కోట్లు

వైద్య విభాగానికి - రూ.241.07 కోట్లు


Updated : 29 Jan 2024 10:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top