Home > అంతర్జాతీయం > దొంగతనం చేసిందంటూ ఆరోపణలు.. న్యూజీలాండ్ ఎంపీ రాజీనామా

దొంగతనం చేసిందంటూ ఆరోపణలు.. న్యూజీలాండ్ ఎంపీ రాజీనామా

దొంగతనం చేసిందంటూ ఆరోపణలు.. న్యూజీలాండ్ ఎంపీ రాజీనామా
X

కోట్ల కొద్దీ రూపాయల ప్రజా ధనాన్ని దోచుకున్నా భారత్ లాంటి దేశాల్లో కొందరు రాజకీయ నాయకులు కొంచెం కూడా పశ్చాత్తాప పడరు. పైగా తాము ఎలాంటి తప్పు చేయలేదంటూ దర్జాగా ఊరేగుతారు. కానీ ఓ చిన్న దొంగతనం కేసులో న్యూజీలాండ్ కు చెందిన ఓ ఎంపీ తన పదవికి రాజీనామా చేశారు. వివరాల్లోకి వెళ్తే.. న్యూజిల్యాండ్‌‌కు చెందిన గోల్ రిజ్ ఘారమన్ అనే 42 ఏళ్ల మహిళ ఎంపీగా పని చేస్తున్నారు. అయితే ఆమెపై ఓ షాప్ లో బట్టలు దొంగతనం చేసిందంటూ ఆరోపణలు వచ్చాయి. షాప్ ఓనర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు ఆమెపై కేసు కూడా నమోదు చేశారు. తమ షాపులో మొత్తం మూడు సార్లు గోల్ రిజ్ ఘారమన్ దొంగతనం చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయం అక్కడి మీడియాలో ప్రధాన శీర్షికన నిలిచింది. దీంతో ఆమెపై విపక్షాలు దుమ్మెత్తిపోశాయి.

ఈ నేపథ్యంలో గోల్ రిజ్ ఘారమన్ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన మానసిక పరిస్థితి బాగాలేదని, ఈ కారణంగానే అప్పుడప్పుడు తనకు తెలియకుండా అలాంటి పనులు చేస్తున్నాని అన్నారు. తాను చేసింది తప్పేనని, కానీ మానసిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లే అలా చేశానని చెప్పారు. తనకు ఏమాత్రం ప్రజా ప్రతినిధిగా ఉండే అర్హత లేదని, అందుకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల ఇలా జరుగుతోందని, తనను క్షమించాలని ఆమె వేడుకున్నారు. కాగా ఇరాన్ నుంచి వలస వచ్చిన గోల్ రిజ్ ఘరామన్‌ కుటుంబానికి న్యూజిల్యాండ్‌లో పొలిటకల్ అసైలమ్ పొందింది. ఘరామన్ చిన్నప్పటి నుంచి న్యూజిల్యాండ్‌లోనే చదువుకున్నారు. ఆమె అక్కడే లా పూర్తిచేసుకొని.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల లాయర్‌గా పనిచేశారు.

Updated : 16 Jan 2024 2:53 PM GMT
Tags:    
Next Story
Share it
Top