Home > జాతీయం > లక్నో జైలులో కలకలం.. 47 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్

లక్నో జైలులో కలకలం.. 47 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్

లక్నో జైలులో కలకలం.. 47 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్
X

లక్నో జైలులో 47 మంది ఖైదీలకు హెచ్ఐవీ నిర్ధారణ కావడం సంచలనం రేపుతోంది. గతంలో 11 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకగా తాజాగా మరో 36 మందికి హెచ్ఐవీ నిర్ధారణ అయింది. దీంతో ఆ సంఖ్య 47కు చేరింది. ఈ విషయాన్ని జైలు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం ఎయిడ్స్ సోకిన ఖైదీలకు లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ ఆశిష్ తివారీ తెలిపారు. 2023 డిసెంబర్లో ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో ఈ రోగ నిర్ధారణ జరిగినట్లు ఆయన తెలిపారు.

వ్యాధి సోకిన ఖైదీలకు కౌన్సిలింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. వ్యాధి సోకిన వారికి ఆహార మార్పులను అనుమతించామని, అలాగే వారందరినీ వైద్యుల పరిశీలనలో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వారందరికీ యాంటీ రెట్రో థెరపీ సెంటర్ లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. కాగా ఈ ఘటనతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. జైలులో హెచ్ఐవీ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Updated : 4 Feb 2024 6:52 PM IST
Tags:    
Next Story
Share it
Top