Home > జాతీయం > కుక్కకు ఘనంగా సీమంతం.. ఎక్కడంటే?

కుక్కకు ఘనంగా సీమంతం.. ఎక్కడంటే?

కుక్కకు ఘనంగా సీమంతం.. ఎక్కడంటే?
X

ఊళ్లో పెళ్ళికి కుక్కల హడావుడి అనే సామెత చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరిదో పెళ్లికి వేరే వాళ్లు హడావిడి చేసినప్పుడు ఇలాంటి సామెతను వాడుతూ ఉంటారు. కానీ ఓ కుక్కకే ఫంక్షన్ చేస్తే జనాలు హడావుడి చేశారు. తమ కుక్క మీద ఉన్న ప్రేమతో ఆ కుక్కకు సీమంతం ఫంక్షన్ చేసింది తమిళనాడుకు చెందిన ఓ కుటుంబం. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా హోసూరు తాలూకాలోని కూరక్కనహళ్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి జుమ్మీ అనే పెంపుడు కుక్క ఉంది. దానిని వాళ్లు తమ సొంత బిడ్డలాగా చూసుకుంటారు. అయితే ఆ కుక్క గర్భం దాల్చింది తెలుసుకున్న ఆ కుటుంబం ఎంతో సంతోషపడింది. ఈ క్రమంలోనే తమ పెంపుడు కుక్కకు సీమంతం నిర్వహించాలనుకున్నారు. ఇంటింటికి బొట్టు పెట్టి సీమంతానికి పిలిచారు. ఈ కార్యక్రమానికి ఇరుగుపొరుగు నుంచి 50 మందిని ఆహ్వానించి ఘనంగా సీమంతం నిర్వహించారు. వచ్చిన పేరంటాళ్లు దానికి బొట్టు పెట్టి, హారతి పట్టి పండంటి బిడ్డలకు జన్మనివ్వాలంటూ దీవించారు. తెలుగు, తమిళంలో పాటలు పాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరూ బహుమతులు కూడా అందించారు. కాగా ఆ కుక్కకు దాని యజమాని ఒక బంగారు గొలుసునే బహుమతిగా అందించారట. మొత్తానికి కుక్కకు కూడా సీమంతాలు చేసే స్థాయికి చేరిపోయారు జనాలు. తాజాగా ఇందకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Updated : 7 Feb 2024 12:13 PM GMT
Tags:    
Next Story
Share it
Top