Home > జాతీయం > హెల్మెట్ లేదని ఆపినందుకు పోలీసు వేలు కొరికిండు

హెల్మెట్ లేదని ఆపినందుకు పోలీసు వేలు కొరికిండు

హెల్మెట్ లేదని ఆపినందుకు పోలీసు వేలు కొరికిండు
X

హెల్మెట్ పెట్టుకోలేదని ఆపినందుకు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కు షాక్ ఇచ్చాడు ఓ యువకుడు. తననే ఆపుతావా అంటూ ఆ కానిస్టేబుల్ వేలును గట్టిగా కొరికాడు. దీంతో లబోదిబో అన్న కానిస్టేబుల్ ఇతర సిబ్బంది సాయంతో సదరు యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు మహానగరంలో విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. సయ్యద్ షఫీ అనే 28 ఏళ్ల వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా హెల్మెట్ లేకుండా అటుగా వచ్చాడు. దీంతో పోలీసులు అతడిని ఆపారు. ఓ కానిస్టేబుల్ అతడి స్కూటర్ తాళాలు లాగేసుకోగా ఈ తతంగాన్ని హెడ్ కానిస్టేబుల్ సిద్ధరామేశ్వర కౌజలగి సెల్ ఫోన్ లో రికార్డు చేయడం ప్రారంభించాడు. తాను హెల్మెట్ పెట్టుకుని రావడం మర్చిపోయానని, హాస్పిటల్ కు వెళుతున్నానని, తననెందుకు ఆపుతున్నారని షఫీ పోలీసులపై మండిపడ్డాడు. అంతేకాదు ఈ వ్యవహారాన్ని చిత్రీకరిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నుంచి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశాడు.

ఎందుకిదంతా రికార్డ్ చేస్తున్నారు? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆ యువకుడు తన పరువు పోతోందని భావించి ఎలాగైనా అక్కడి నుంచి బండితో సహా తప్పించుకోవాలని భావించాడు. దీంతో కానిస్టేబుల్ వేలు కొరికి బండి తాళాలు తీసుకుని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును దూషించడమే కాకుండా.. శారీరకంగా గాయపర్చడం, నేరపూరితమైన బెదిరింపులకు పాల్పడడం వంటి అభియోగాలతో అతడిపై కేసు నమోదు చేశారు.

Updated : 13 Feb 2024 8:49 PM IST
Tags:    
Next Story
Share it
Top