Home > జాతీయం > కేరళ యువకుడికి జాక్పాట్.. ఎంత గెలుచుకున్నాడో తెలుసా?

కేరళ యువకుడికి జాక్పాట్.. ఎంత గెలుచుకున్నాడో తెలుసా?

కేరళ యువకుడికి జాక్పాట్.. ఎంత గెలుచుకున్నాడో తెలుసా?
X

బిగ్ టికెట్ అబుదాబీ వీక్లీ డ్రాలో ఓ ఎన్ఆర్ఐకి పెద్ద జాక్ పాట్ తగిలింది. ఫ్రీగా టికెట్ తో రూ.33 కోట్ల లాటరీ తగిలింది. దీంతో ఆ యువకుడి ఆనందానికి అంతేలేకుండా పోయింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన రాజీవ్ కొన్నేళ్లుగా యూఏఈలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజీవ్ గత మూడేళ్లుగా బిగ్ టికెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈసారి ఆయనకు ఆరు టికెట్లు లభించాయి. బిగ్ టికెట్ పై ఈసారి స్పెషల్ ఆఫర్ లభించింది. రెండు టికెట్లు కొంటే నాలుగింటిని ఉచితంగా పొందాడు.

రాజీవ్, అలాగే తన భార్య పేరు మీద 7, 13 నంబర్లతో ఉన్న టికెట్లు కొన్నారు. ఆ టికెట్లు కూడా పిల్లల పుట్టినరోజు తేదీలతో తీసుకున్నారు. ఒరిజనల్ గా రెండు టికెట్లు కొంటే నాలుగు టికెట్లు ఉచితంగా లభించాయి. ఆ ఫ్రీ టికెట్లో ఒకటి విజయం సాధించింది. రూ.33 కోట్ల లాటరీ తగలినట్లు ప్రకటన చేయగానే కుటుంబమంతా సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఇక తాను గెల్చుకున్న డబ్బును ఎలా ఖర్చు పెట్టాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాజీవ్ తెలిపారు. అయితే ఆ డబ్బును మరో 19 మందితో పంచుకుంటానని రాజీవ్ తన మంచి మనసు చాటుకున్నాడు.

Updated : 10 Feb 2024 9:56 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top