Home > జాతీయం > అయోధ్య రామాలయానికి కానుకగా వెండి చీపురు

అయోధ్య రామాలయానికి కానుకగా వెండి చీపురు

అయోధ్య రామాలయానికి కానుకగా వెండి చీపురు
X

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో నిర్మించిన రామ మందిరం ఈ నెల 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠకు ప్రధాని మోడీ, యూపీ గవర్నర్ ఆనందీబెన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు దేశంలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈ రామ మందిరానికి అనేక మంది తమకు తోచిన విధంగా విరాళాలు, కానుకలు ఇచ్చారు. కాగా అయోధ్య రామాలయానికి ఇంకా విరాళాలు, కానుకలు వస్తూనే ఉన్నాయి. తాజాగా అఖిల భారతీయ మాంగ్​ సమాజ్​ కు చెందిన శ్రీరామ భక్తులు బాలక్​ రామ్​ కోసం ఒక చీపురును కానుకగా ఇచ్చారు.

అది కూడా 1.751 కిలోల వెండిని ఉపయోగించి తయారు చేసినది. ఈ వెండి చీపురును అఖిల భారత మాంగ్ సమాజ్​ భక్తలు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు విరాళంగా అందించారు. బాలక్ రామ్​ గర్భగుడిని ఈ వెండి చీపురుతో శుభ్రం చేయాలని కోరారు. కాగా అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 108 అడుగుల పొడవాటి అగరుబత్తిని బాలరాముడికి కానుకగా ఇచ్చారు. దీనిని గుజరాత్ లోని వడోదరాలో తయారు చేశారు. పంచ ద్రవ్యాలు, హవన పదార్థాలతో తయారుచేసిన ఈ మహా అగరుబత్తి బరువు 3 వేల 500 కిలోలు ఉంటుంది. దీనిని తయారు చేయడానికి 6 నెలలు పట్టింది. దీనికి 5 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశారు.

Updated : 28 Jan 2024 6:11 PM IST
Tags:    
Next Story
Share it
Top