Home > జాతీయం > మధ్యప్రదేశ్ కేబినేట్ విస్తరణ.. 28 మంది మంత్రులు

మధ్యప్రదేశ్ కేబినేట్ విస్తరణ.. 28 మంది మంత్రులు

మధ్యప్రదేశ్ కేబినేట్ విస్తరణ.. 28 మంది మంత్రులు
X

మధ్యప్రదేశ్ కేబినేట్ ను ఇవాళ విస్తరించారు. ఈ విస్తరణలో మొత్తం 28 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేయగా.. ఆయన మంత్రి వర్గంలో ప్రధుమన్ సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కైలాష్ విజయవర్గీయ, విశ్వాస్ సారంగ్ సహా 18 మంది నేతలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 6 మంది నాయకులు రాష్ట్ర మంత్రులుగా (స్వతంత్ర బాధ్యతలు), 4 నాయకులు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఈ నెల 3న వెలువడిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 230 అసెంబ్లీ స్థానాలకుగాను ఏకంగా 163 చోట్ల విజయం సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా మోహన్ యాదవ్, డిప్యూటీ సీఎంలుగా జగదీష్ దేవా, రాజేంద్ర శుక్లా ఈ నెల 13న ప్రమాణ స్వీకారం చేశారు. కాగా 16 సంవత్సరాల పాటు సీఎంగా కొనసాగిన శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఈసారి బీజేపీ హైకమాండ్ నో చెప్పింది. నూతన సీఎం మోహన్ యాదవ్ కు గైడ్ లా వ్యవహరించాలని, జాతీయ స్థాయిలో ఉన్నత స్థానం కల్పిస్తామని ఆయనకు నచ్చజెప్పింది బీజేపీ అధిష్టానం.

Updated : 25 Dec 2023 11:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top