Home > జాతీయం > రాహుల్ యాత్రలో అఖిలేశ్.. కీలక వ్యాఖ్యలు చేసిన ఎస్పీ చీఫ్

రాహుల్ యాత్రలో అఖిలేశ్.. కీలక వ్యాఖ్యలు చేసిన ఎస్పీ చీఫ్

రాహుల్ యాత్రలో అఖిలేశ్.. కీలక వ్యాఖ్యలు చేసిన ఎస్పీ చీఫ్
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆదివారం రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆయనకు స్వాగతం పలికారు. ఇక యూపీలో కాంగ్రెస్, ఎస్పీల మధ్య లోస్ సభ సీట్లకు సంబంధించిన ఒప్పందం కుదిరిన తర్వాత అఖిలేష్ రాహుల్ యాత్రలో పాల్గొనడం గమనార్హం. ఇక రాహుల్ యాత్రకు వచ్చిన అఖిలేశ్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడటం అనేద పెద్ద సవాలుగా మారనుందని అన్నారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించాలంటే "బీజేపీ హటావో, దేశ్ కో బచావో, సంకట్ మిటావో" అనే సందేశాన్ని దేశ ప్రజలకు ఇవ్వాలని అన్నారు.

రానున్న రోజుల్లో NDAని ఓడించడానికి INDIA కూటమి, PDA (పిచ్రే, దళిత్, అల్పసంఖ్యాక్) పని చేస్తాయని అన్నారు. కాగా ఉత్తరప్రదేశ్ లో మొత్తం 80 లోస్ సభ స్థానాలు ఉండగా పొత్తులో భాగంగా ఎస్పీ 63 స్థానాలు, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఈ మేరకు ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే ఢిల్లీలోనూ ఆప్ తో కాంగ్రెస్ ఎంపీ సీట్లను పంచుకుంది. ఢిల్లీలో మొత్తం 7 ఎంపీ స్థానాలు ఉండగా.. ఆప్ 4, కాంగ్రెస్ 3 తీసుకున్నాయి.



Updated : 25 Feb 2024 7:06 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top