Home > జాతీయం > చదువు నేర్పిన కాలేజీకి రూ.57 కోట్ల విరాళం

చదువు నేర్పిన కాలేజీకి రూ.57 కోట్ల విరాళం

చదువు నేర్పిన కాలేజీకి రూ.57 కోట్ల విరాళం
X

తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఓ కాలేజీ రుణం తీర్చుకున్నారు ఆ కాలేజీ పూర్వ విద్యార్థులు. అక్షరాల రూ.57 కోట్లు విరాళంగా అందించి కాలేజీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఐఐటీ బాంబేకు చెందిన 1998 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు. కాలేజీలో జాయిన్ అయి ఈ ఏడాదితో 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ పూర్వ విద్యార్థులు ఇటీవల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చదివిన కాలేజీకి తమ వంతుగా సాయం చేయాలనుకున్నారు. తమ ఆర్థిక ఉన్నతికి కారణమైన కాలేజీకి దాదాపు 200 మంది విద్యార్థులు నిధులు సమీకరించారు. తమకు మంచి జీవితాన్ని అందించిన ఆ సంస్థకు ఆ మొత్తాన్ని విరాళంగా అందించారు. సిల్వర్ లేక్ ఎండీ అపూర్వ సక్సేనా, పీక్ XV ఎండీ శైలేంద్ర సింగ్, వెక్టార్ క్యాపిటల్ ఎండీ అనుపమ్ బెనర్జీ, గూగుల్ డీప్ మైండ్ కు చెందిన దిలీప్ జార్జి వంటి 200 మందికిపైగా పూర్వ విద్యార్థులు ఇందులో భాగమయ్యారు.

Updated : 24 Dec 2023 1:44 PM GMT
Tags:    
Next Story
Share it
Top